పండుగ పూట విషాదం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రంగారెడ్డి, ఆగస్టు 15: రాఖీ పండుగ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
జేసీబీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ నక్కలపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మృతులు సుభాన్ పూర్ గ్రామానికి చెందిన పోచారం బాల్ రెడ్డి, అతని భార్య జ్యోతి, వాారి కూతురిగా గుర్తించారు. జేసీబీ కింద చిక్కుకున్న మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. తమ్ముడికి రాఖీ కట్టి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఖీ కట్టీ తిరిగి వస్తూ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటం అందరిని కలచివేయగా, ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.