ఆర్టీసీ బస్సు బోల్తా: 30మందికిపైగా గాయాలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
భువనగిరి, అక్టోబర్ 22: ఆర్టీసీ సమ్మె కారణంగా తెలంగాణ సర్కార్ తాత్కాలిక డ్రైవర్లను నియమించి, బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాత్కాలిక డ్రైవర్లతో పలు చోట్ల ప్రమాదాలు జరిగిన విషయం కూడా తెలిసిందే. తాజాగా, మరో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. వరంగల్ జిల్లా పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ మీదుగా వరంగల్ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది