అక్కడ ప్రమాదం..ఇక్కడ విషాదం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 21: కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై గజ్వేల్ సమీపంలో సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారికీ కారు ఢీకొన్న ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మానకొండూర్ మండలం వేగురు పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కనుకుంట్ల మల్లేశం (47), టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్ఎంపీ వైద్యుడు జంగ ప్రభాకర్ రెడ్డి (50), వేగురుపల్లి గ్రామ పంచాయితీ వార్డు సభ్యుడు జనార్దన్ రెడ్డి(40) మృతి చెందారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన తుపాకిరాముడు సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేేసు దర్యాప్తులో ఉంది. ఒకేసారి ముగ్గురు మృతి చెందడం వెగురుపల్లి లో విషాదం నెలకొంది. కాగా, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మానకొండూర్ కు చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.