రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జనగామ, సెప్టెంబర్ 19: జనగామ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దేవరుప్పుల సమీపంలో కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులు మహబూబాబాద్ కు చెందిన పెనుగొండ గణేష్ (60), పెనుకొండ సుకన్య (38), ఎండీ నజీర్ గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.