ఘోర రోడ్డు ప్రమాదం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 4: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీకి కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారీగా గుర్తించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.