ఊరుకాని ఊరిలో…బతుకు బాటలో
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 21: బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టిన ఇద్దరు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడెంకు చెందిన ఉప్పు మల్లేశ్ (40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజు (24) మృతి చెందారు. రాజు, మల్లేశ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఊరుకాని ఊరిలో బతుకుదెరువు కోసం వెళ్లి మృత్యువాతపడటం అందరిని కలచివేసింది. ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.