రెండు లారీలు ఢీ: రథసారధులు మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
బాల్కొండ, ఆగస్టు 16: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో
44వ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువ జామున రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్లు ఇద్దరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపుకు వెళ్తుండగా, చిట్టాపూర్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.