బోల్తా పడ్డ మంత్రి కాన్వాయ్ లోని కారు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జనగామ, నవంబర్ 24: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని చీటూరు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మంత్రి పాలకుర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఆయన వెనక వస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిన ఘటన లో డ్రైవర్ పార్థసారథి (30), పూర్ణ (27) అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అదే వాహనంలో ఉన్న గన్‌మన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.