JMS News Today

For Complete News

ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

వేములవాడ, ఆగస్టు 28: సిరిసిల్ల జిల్లా  వేములవాడ పట్టణంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  విద్యార్ధుల మృతి చెందారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఈ ఘటన విద్యార్థుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *