కొబ్బరి కాయ కొట్టిన మంత్రి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 28: కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న 14.5 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం ఎస్ ఆర్ ఆర్ కళాశాల వద్ద 5.15 కోట్లతో నిర్మిస్తున్న రెండు రోడ్ల తుది దశ నిర్మాణ పనులను మంత్రి కమలాకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ నిధులకింద మంజూరైన కోర్టు నుండి ఆర్టీసీ వర్క్ షాప్ వరకు 2 కోట్ల 80 లక్షలు , జయరాం హాస్పిటల్ నుంచి మార్కెట్ వరకు రెండు కోట్ల 35 లక్షలతో నిర్మించే రహదారి పనులను ప్రారంభించామని అన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పది రోజుల్లో పూర్తి చేస్తామని, తద్వారా కరీంనగర్ రోడ్ల యొక్క రూపురేఖలు మారుతుందని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ఫైనల్ కోటింగ్ పనులు హాలీ మార్ మాడిఫైడ్ బిట్ తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీకి పాత బిటి రోడ్డు కన్నా30 నుండి 40 శాతం అధిక నిధులు ఖర్చు అవుతుందని అన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తి అయిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న రెండు ఫీట్ల ఖాళీ స్థలంలో సిమెంట్ వేసి ఇ ఫుట్పాత్ నిర్మాణం చేపడతామని తెలిపారు. అనంతరం రోడ్లపైన అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్లో వైట్ జిబ్రా లైన్లతో మార్కింగ్ చేస్తామని తెలిపారు. నగరంలోని ముఖ్యమంత్రి హామీ నిధుల ద్వారా నిర్మించే రోడ్ల తో పాటు స్మార్ట్ సిటీ రోడ్లు ఆర్ అండ్ బి రోడ్ లతోపాటు అంతర్గత రహదారులు కూడా పూర్తి చేస్తామని అన్నారు ఈ పనులన్నీ మూడు నెలల్లో పూర్తి చేసి కరీంనగర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో నగర ప్రజలంతా సహకరించాలని, ఈ పనులన్నీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాత్రి వేళల్లో కొనసాగిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ లో త్వరలో ఐ టి టవర్ తోపాటు కేబుల్ బ్రిడ్జి పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.