రోడ్ సేఫ్టీ ఎలా…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 11: రక్తసిక్తమవుతున్న రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యల కోసం గుురువారం రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సభ్యులు రాజీవ్ రహదారిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. అల్గునూరు చౌరస్తా, ఎన్టీఆర్ విగ్రహం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం జంక్షన్, ఆటోనగర్, సుశ్రుత హాస్పిటల్ జంక్షన్, లారీ అసోసియేషన్ ఆఫీస్ బొమ్మకల్ జంక్షన్, బొమ్మకల్ కోకాకోల దాబా, దుర్షెడ్ తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడ తరుచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ కమిటీలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి, ఉప రవాణా కమిషనర్ పుప్పాల శ్రీనివాస్, ఆర్ & బి అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, కరీంనగర్ హైదరాబాద్ (ఎచ్కెఆర్) రోడ్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.