సమయం చూసి… ఎత్తుకెళ్ళారు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 29: నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింహాద్రి నగర్ లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు ఇళ్ళల్లో చోరికీ పాల్పడి సుమారు 10తులాల బంగారం, లక్ష నగదును దొంగలు ఎత్తుకుపోయారు. పెళ్ళి కోసం ఊరుకి వెల్లిన సమయం చూసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.