వారికి కనువిప్పు కాలే…ఆర్టీసీ బస్సు సీజ్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 17: కొండగట్టు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినా..ఆర్టీసీ అధికారులకు మాత్రం కనువిప్పు కలగలేదు. దీనికి తోడు ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ తరువాత పట్టించుకోకపోవడం సర్వ సాధారణమే. ఇది జగమెరిగిన సత్యం. తాజాగా బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిధిలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను రవాణా శాఖ అధికారి సీజ్ చేశారు. బస్సులో 55 మంది ప్రయాణీకులను తీసుకెళ్ళాల్సి ఉండగా, పరిమితిని మించి 125 మంది ప్రయాణీకులను తీసుకేళ్తున్న కోరుట్ల డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ను జగిత్యాల రవాణా శాఖ అధికారి కిషన్ రావు ఆపి ప్రయాణీకులను దించివేసి బస్సు ను సీజ్ చేశారు.