మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
మహబూబాబాద్, నవంబర్ 13: ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో డ్రైవర్ నరేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.
మహబూబాబాద్ డిపోలో నరేశ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడం లాంటి పరిణామాల క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఇవాళ ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.