JMS News Today

For Complete News

ఆర్ఎంకు వినతి…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసి) కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ)  కరీంనగర్  రీజినల్ గౌరవ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం జీవన్ ప్రసాద్ ను యూనియన్ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదని, విలీనం హామీని అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేని పక్షంలో సమ్మెకు పోవాల్సి వస్తుందని ఈ మేరకు తమ యూనియన్ ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చిందని గుర్తుచేశారు. సమ్మె అనివార్యమైతే కార్మికులంతా కలిసికట్టుగా సమ్మెను విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎమ్యూ కరీంనగర్ డివిజన్ చైర్మన్ నంద మధుసూదన్, రీజినల్ ప్రెసిడెంట్ గుడికందుల శ్రీనివాస్, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రమేష్ కుమార్. సీహెచ్ రవీందర్, ఆర్ రమేష్ ,సుద్దాల లింగయ్య, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కల్యాడపు ఆగయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర సత్యం, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, పార్టీ నాయకులు వంచ శ్రీనివాస్ రెడ్డి, దాసరి రామకృష్ణారెడ్డి, వేముల లక్ష్మణరావు, మిట్టపల్లి శ్రీనివాస్, ఎర్రబెల్లి రవీందర్, వేముల రాజేశం, బసాలత్ మొహమ్మద్ ఖాన్, జెల్లోజి శ్రీనివాస్, ఎర్రబెల్లి వినీత్, ఆకుల కాంతయ్య, నరేందర్ దత్తు, నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *