ఆర్టీసీ సమ్మెకు పీఎంటీఏ మద్దతు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 14: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన
ఆర్టీసీ కార్మికులకు పీఎంటీఏ-టీీఎస్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీ వాళ్ళు తమ సంస్థను కాపాడుకోవడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టి ఈ నెల 5 నుండి చేస్తున్న సమ్మెకు ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ -తెలంగాణ రాష్ట్రం (పీఎంటీఏ) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్ననట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతి కిరణ్ ఆచార్య ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈరోజు నుండి మీరు చేస్తున్న న్యాయమైన పోరాటంలో మీకు వెన్నుదన్నుగా నిలుస్తామని, మీ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాక మీతో నడుస్తామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిచేంతవరకు పోరాటాలు చేద్దామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీపట్ల చూపిస్తున్న దమననీతి ని ఖండిస్తున్నామని, న్యాయమైన పోరాటాలకు తమ సంఘం సిద్ధంగా ఉంటుందని, రాష్ట్ర, జిల్లా శాఖల తరుపున ప్రకటిస్తున్నామని వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్మికులు వారి న్యాయపరమైన హక్కుల కోసం డిమాండ్ చేస్తూ సమ్మె కు వెళ్తే వారి సమస్యల సాధనపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో నలభై ఎనిమిది వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.