సమ్మెపై విచారణ షురూ….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు. నిన్న హైకోర్టులో అధికారులు సమర్పించిన నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలుసా? అని గుర్తుచేసింది. ఓ ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్లు నివేదికలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారంటే.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తానికి ఆర్టీసీ సమ్మె పై కోర్టు లో విచారణ ప్రారంభం కాగా, కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.