భజరంగ్ దళ్ ఆరోపణలు అవాస్తవం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 26: బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలు పెట్టారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక అమ్మాయిని విధిస్తున్నారనే విషయంలో ఏడుగురు వ్యక్తులు ఇతర మతానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని, ఈ సంఘటనపై కేసులు నమోదు చేశామని, తర్వాతనే వారు భజరంగ్ దళ్ కు చెందిన వారని తెలిసిందని వివరించారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడడం సరైందికాదని అన్నారు. అమ్మాయిని వేధించిన ఘటనలో సదరు యువకునిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. పోలీసులు కొట్టారని, రోకలి బండ ఎక్కించారని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని శశిధర్ రెడ్డి తెలిపారు.