JMS News Today

For Complete News

మోతె ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్తాపన

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 26: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ కాలువ వద్ద రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మోతె ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 271కోట్ల వ్యయంతో మోతె ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. రెండేళ్లలోనే ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులకు దీటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని వివరించారు. దేశంలోనే ఏ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా పూర్తి కాలేదని, ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి రాజేందర్ కు టిఆర్ ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *