ఎట్టకేలకు వశిష్ఠ బయటకు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కచ్చులూరు, అక్టోబర్ 22: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డైవర్లు తీవ్రంగా కృషి చేసి చివరకు దాన్ని మంగళవారం సాయంత్రం బయటకు తీశారు. మరో రెండు గంటల్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. గత నెల 15న పర్యాటకులతో వెళ్తున్న బోటు మునిగిపోగా, ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతి చెందగా, 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.