JMS News Today

For Complete News

సీనియర్ జర్నలిస్టు నేతకు కేబినెట్ హోదా

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 22: జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారులుగా క్యాబినెట్ మంత్రి హోదాలో సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అమర్ నియామకం పట్ల జర్నలిస్టు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె -ఐజెయు) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ, సీనియర్ జర్నలిస్టు మల్లయ్య, నాయకులు ఎలగందుల రవీందర్, విజయసింహరావు , మహేంద్ర చారి, మధుకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *