సీనియర్ జర్నలిస్టు మృతి….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రాయికల్, నవంబర్ 5: రాయికల్ మండలం రామోజీపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బూస మధుసూదన్ గుప్తా (45) బుధవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మధు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, మరణించారు. రెండు దశాబ్దాలకుపైగా పాత్రికేయ రంగం (ఆంధ్రభూమి)లో పనిచేసిన మధు ఆకస్మిక మరణం పట్ల తోటి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మండలంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పేద జర్నలిస్టు మధు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. మధుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.