రెచ్చిపోయిన దొంగలు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 12: జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. జిల్లాలోని రాయికల్ మండలం చర్ల కొండాపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఏడు ఇళ్లలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 31తులాలు వెండి, 2తులాల బంగారం ఎత్తుకెళ్తారు. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.