చిన్న బండి…అంత మంది
1 min read
హైదరాబాద్: హెల్మెట్ లేకుండా…ప్రమాదం అని తెలిసినా ..ఓ వ్యక్తి బైక్ పై ఆరుగురు విద్యార్థులను తీసుకెళుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ముందు ముగ్గురు, వెనుక మరో ముగ్గురిని కూర్చొబెట్టుకొని వెళుతున్న వ్యక్తిని సెవెన్ టూంబ్స్ రోడ్డులో టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయని, హెల్మెట్ కూడా ధరించలేదని, పిల్లలను ఇలా తీసుకెళ్లడం సరికాదని, మరోమారు ఇలా వెళ్లకూడదని హెచ్చరించారు.