JMS News Today

For Complete News

శంకర్ మామ టెన్త్ ఫెయిల్ విడుదల

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 21: ఆద్య -నిక్షిత సమర్పణలో “అయిలూస్ మీడియా హౌస్”
బ్యానర్ పై సీనియర్ జర్నలిస్టు అయిలు రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “శంకర్ మామ టెన్త్ ఫెయిల్” సందేశాత్మకమైన లఘు చిత్రాన్ని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గాజుల శనివారం కరీంనగర్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన ఐలు రమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయ్ సింహా రావు, జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగోజు మహేందర్, చిత్ర హీరో, హీరోయిన్లు సుమన్ గౌడ్, ప్రియ, నటీనటులు ప్రభు తిప్పర్తి , సీతామాలక్ష్మి, మహేష్, సంతోష్, కెమెరామెన్ కిషన్ నునుగొండ, మేకప్ మెన్ అశోక్ శ్రీరామోజు తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదు అని, టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ అనే వ్యక్తి తన జీవితంలో ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు అనేది ఈ చిత్రంలో చూపించినట్లు దర్శకులు అయిలు రమేష్ తెలిపారు. ఈ చిత్రంలో యూట్యూబ్ స్టార్స్ సుమన్ గౌడ్ అలియాస్ శంకర్, ప్రియా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ లఘుచిత్రంలో సీనియర్ జర్నలిస్ట్ నగునూరి శేఖర్, మాడిశెట్టి గోపాల్ , మరో యూట్యూబ్ స్టార్ సీతామాలక్ష్మి , సింహాచలం యతింధర్ , తిప్పర్తి ప్రభాకర్, గద్దె ఉదయ్ కుమార్ , కిషోర్ దూలూరు, రామ్ మొగిలోజి, శివ ప్రసాద్, రవీంద్ర చారి, నరేష్ కట్కూరి, మారుతి స్వామి, వంశీకృష్ణ అయిలు, మహేష్ కన్నం, భాను, వెంకట ప్రసన్న ,సంతోష్, గోపి , వేణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కిషన్ నునుకొండ, ఎడిటింగ్ :రాము మొగిలోజి, మేకప్ : అశోక్ శ్రీరామోజు, రచనా సహకారం :వై.రత్నారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్: రవీంద్ర చారి, నిర్మాత : అయిలు రమేష్, కథ ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అయిలు రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *