షిరిడీ సాయిబాబా ఆలయం మూసివేత
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
షిరిడీ, మార్చి 17: కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో సైతం ముందస్తు చర్యలు చేపట్టారు. తాజాగా అత్యధిక రద్దీ ఉండే ప్రముఖ షిరిడీ దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు.