అమెరికా వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికాలో కాల్పుల కలకలం సృష్టిస్తోంది. గత అర్ధరాత్రి టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఆగంతుకులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతిచెందగా, క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఏం జరుగుతోందో తెలియక స్టోర్‌లోని వారు భయంతో పరుగులు తీశారు. వారం రోజుల వ్యవధిలోనే వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు జరగడం ఇది రెండోసారి. కాల్పులు జరిపిన దుండగుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు.