JMS News Today

For Complete News

రాజగోపాల్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ

1 min read

హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీపై, పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సోమవారం గాంధీభవన్‌లో కమిటీ ఛైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన భేటీ అయిన సంగతి విదితమే. ఈ సందర్బంగా రాజగోపాల్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులు, వార్త పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించారు. ఆయన గతంలో కూడా ఇదే తరహాలో చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయాలను సైతం చర్చించారు. రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో మాట్లాడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం జగ్గారెడ్డిని కూడా పిలిచి వివరణ తీసుకుంది. ఈ మేరకు ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయిస్తూ…కమిటీ నిర్ణయాన్ని తెలియచేస్తూ ఏఐసీసీ, పార్టీ రాష్ట్ర ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తదితరులకు ప్రతిపాదనలు పంపించింది. వారి నుంచి అనుమతి రావడంతో ఇవాళ రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *