ఆమె సాధించింది…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 13: పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఎస్సై తుది పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన అనుపాటి హరిప్రియ ఎస్ఐ (సివిల్) గా ఎంపికయ్యారు. స్వగ్రామంలో ఆరు నుంచి పదవ తరగతి వరకు, కరీంనగర్ లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన హరిప్రియ పీజీ హైదరాబాద్ బేగంపేట లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగం సంపాదించాలనే తపనతో హైదరాబాద్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో హరిప్రియ శిక్షణ పొందారు. ఉద్యోగం కోసం కఠోర సాధన చేసింది. చివరకు ఆమె అనుకున్న కొలువు ఆమె దరిచేరింది. ఈరోజు విడుదలైన ఎస్ఐ తుది పరీక్ష ఫలితాల్లో హరిప్రియ ఎంపికయ్యారు. ఆమె ఎంపిక పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయగా, జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్ వెబ్ న్యూస్ ప్రత్యేక అభినందనలు తెలిపింది.