ఎస్ఐ కీ ఘన వీడ్కోలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 23: బదిలీపై వెళుతున్న ఎస్సై నాగరాజు కు ఘనంగా వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా కరీంనగర్ వన్ టౌన్ లో ఎస్ఐ గా విధులు నిర్వర్తించి వరంగల్ కమిషనరేట్ కు బదిలీ అయిన ఎస్ఐ నాగరాజు కు ఆదివారం వన్ టౌన్ ఇనస్పెక్టర్ శ్రీనివాస రావు, పోలీసు సిబ్బంది వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఆయనకు శాలువ కప్పి ఘనంగా సన్మానం చేశాారు.