సింగరేణి సిఎండి శ్రీధర్ తో ఆస్ట్రేలియా ప్రతినిధుల భేటీ
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రగతి పథంలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విషయాల్లో సహకరించే విషయంపై ఆస్ట్రేలియా దేశ ట్రెడ్ & ఇన్వెస్ట్ మెంట్ సీనియర్ కమీషనర్ (సౌత్ ఏషియా విభాగం) డాక్టర్ మాథీవ్ డర్బన్ సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ తో శుక్రవారం సమావేశమయ్యారు. హైద్రాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఈ భేటీలో ఆస్ట్రేలియా సీనియర్ కమీషనర్ తో పాటు బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ (ఇండియా) రామకృష్ణ దస్త్రాల, సింగరేణి జి.ఎం. కో-ఆర్డినేషన్ & మార్కెటింగ్ శ్రీ ఆంటోనిరాజాలు పాల్గొన్నారు. సింగరేణి సిఎండి. శ్రీధర్ సింగరేణి సంస్థలో ప్రస్తుతం అమలవుతున్న టెక్నాజీలు, బొగ్గు ఉత్పత్తి, గత ఐదేళ్లుగా సాధిస్తున్న వృద్ధి, బొగ్గు, సోలార్ థర్మల్ విద్యుత్తు రంగాలలో వ్యాపార విస్తరణ చర్యలు తదితర విషయాలను వివరించారు. సింగరేణి ప్రగతికి దోహదపడే అంశాలపై తగు సహకారాన్ని అవసరాన్ని బట్టి స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే సింగరేణి సంస్థ ఆస్ట్రేలియా దేశానికి చెందిన సింటార్స్, సిస్రో (సిఎస్ఐఆర్ఓ) వంటి సంస్థలతో మైనింగ్, రక్షణ, సాంకేతిక విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకొందనీ, వారి సేవలను స్వీకరిస్తోందని విరించారు. సింగరేణి సంస్థ100 మిలియన్ టన్నుల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అధికోత్పత్తి సాధించే ఆధునిక యంత్రాలు, వివిధ విభాగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్ట్రేలియా దేశ కంపెనీ నుండి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కమీషనర్ డర్బన్ వివరించారు.
సింగరేణి అవసరాలపై అధ్యయనం చేసి, తగు ప్రతిపాదలను సూచించవసిందిగా శ్రీధర్ ఆస్ట్రేలియా బృందానికి సూచించారు. వ్యాపార విస్తరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అవసరాలను బట్టి సహకారం తీసుకుంటామని తెలియజేశారు.