JMS News Today

For Complete News

అలా చేయాలి…అప్పుడే…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 2: వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే జూలై, ఆగష్టు నెలల్లో రోజుకు ఒక లక్ష 85 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అంతే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని, ఓ.సి. గనుల నుండి రోజుకు 11 లక్షల 28 వేల క్యూబిక్ మీటర్ల ఓ.బి. తొలగించాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. హైద్రాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో శ్రీధర్  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కొత్త ఓపెన్కాస్ట్ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిష్టారం ఓపెన్కాస్ట్, కె.టి.కె. ఓ.సి.-3, జి.డి.కె.-5 ఓ.సి., కోయగూడెం ఓ.సి.-3, ఇందారంఖని ఓ.సి.లను ప్రారంభించి సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నైనీ బొగ్గు బ్లాకు (ఒడిస్సా) లో జరుగుతున్న ఎక్స్ ప్లోరేషన్ పనులు, ప్రభుత్వ అనుమతులపై కూడా సమీక్షిస్తూ వచ్చే ఏడాది ఇక్కడి నుండి బొగ్గు ఉత్పత్తి జరగాలని అందుకు సన్నాహాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై నెల వరకు సాధించిన వృద్ధిపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏరియాల వారీగా సాధించాల్సిన లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరం జూలై నెలతో ముగిసిన నాలుగు నెలల కాలంలో గత ఏడాది ఇదే కాలానికి సాధించిన దానిపై బొగ్గు ఉత్పత్తిలో 17 శాతం వృద్ధిని, రవాణాలో 3 శాతం వృద్ధి, ఓ.బి. తొలగింపులో 6 శాతం వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు 190 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా 17 శాతం వృద్ధితో ఈ ఏడాది 222 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని. అలాగే గత ఏడాది ఇదే కాలానికి 214 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా ఈ ఏడాది 3 శాతం వృద్ధితో 220 లక్షల టన్నులో బొగ్గు రవాణా జరిపినట్లు తెలిపారు. గత ఏడాది జూలై నాటికి 117.7 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఓవర్ బర్డెన్ (ఓ.బి.) తొలగించిన కంపెనీ ఈ ఏడాది 6 శాతం వృద్ధితో 124 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓ.బి.ని తొలగించిందని చెప్పారు. ఈ ఏడాదికి నిర్దేశించుకొన్న లక్ష్యాల ప్రకారం పరిశీలిస్తే సింగరేణి సంస్థ జూలై నాటికి ముగిసిన 4 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను దాటి విజయపథంలో ముందుకు సాగుతోందని, జూలై నాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 210 లక్షల టన్నులు కాగా కంపెనీ 106 శాతంతో 222.2 లక్షల టన్నులో బొగ్గు ఉత్పత్తి సాధించిందని వివరించారు. బొగ్గు రవాణా 210 లక్షల టన్నులు జరపాల్సి ఉండగా, 104 శాతంతో 219 లక్షల టన్నులు సాధించిందని, నెల వారీగా చూస్తే జూలై నెలలో గత ఏడాది కన్నా బొగ్గు ఉత్పత్తిలో 16 శాతం, రవాణాలో 13 శాతం, ఓ.బి. తొలగింపులో 38.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్.శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ మరియు పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, ఇ.డి. కోల్ మూమెంట్ జె.ఆల్విన్. అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, జి.ఎం. (సి.డి.ఎన్.) ఆంటోనిరాజా, జి.ఎం. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కె.వి. రమణమూర్తి, జనరల్ మేనేజర్ (సి.ఎం.) కె.రవిశంకర్, జనరల్ మేనేజర్ ఎస్టేట్స్ ఎస్.డి.ఎం. సుభాని, జనరల్ మేనేజర్ (ఓ.సి. మైన్స్) వై.జి.కె.మూర్తి, జనరల్ మేనేజర్ (యం.యస్.) ఎ.ఋష్యేంద్రుడు, జి.ఎం. (ఐ&పి.యం.) డి.రాంచందర్, జి.ఎం. ఎన్విరాన్మెంట్ జె.వి.ఎల్.గణపతి, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *