JMS News Today

For Complete News

మరో విషాదం…దిగ్భ్రాంతిలో చిత్రసీమ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, నవంబర్ 30: తెలుగు చలనచిత్ర సీమలో మరో విషాదం నింపింది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మరణం మరువకముందే మరో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనను ఈ నెల 24 న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సీతారామ శాస్త్రి 1955 మే 20 న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి కాగా, సిరివెన్నెల సినిమాకు తొలి గీతాలు రాసిన సీతారామ శాస్త్రి సినిమా పేరే ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన సుమారు మూడువేల వరకు సినీ గీతాలు రాశారు. కేవలం రెండురోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తుల మరణం తెలుగు చలనచిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. శాస్త్రీ మరణం పట్ల అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published.