ఆరుగురు ఇన్ స్పెక్టర్ ల బదిలీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 14: ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఆరుగురు సర్కిల్ ఇన్ స్పెక్టర్ లు బదిలీ అయ్యారు. కరీంనగర్ వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు కరీంనగర్ రూరల్ కు, ఇక్కడ ఉన్న ఇన్ స్పెక్టర్ శశిధర్ రెడ్డి విఆర్ కు, కరీంనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సీతారెడ్డి విఆర్, ఇక్కడ ఉన్న తిరుమల్ ట్రాఫిక్ ఎస్ హెచ్ఓగా, ఎస్ఐబి లో ఉన్న ఇన్ స్పెక్టర్ మహేష్ గౌడ్ ఎల్ఎండికి, ఇక్కడ ఉన్న ఇన్ స్పెక్టర్ కరుణాకర్ విఆర్, నిర్మల్ ఎస్పీ ఆఫీసు లో ఉన్న ఎన్.శ్రీనివాస్ తాండూర్, ఇక్కడ ఉన్న ఇన్ స్పెక్టర్ ఉపేందర్ విఆర్, గోదావరిఖని టు టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మంచిర్యాలకు, రామగుండం సీపీ ఆఫీసు లో ఉన్న ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రావు బైంసా టౌన్, ఇక్కడ ఉన్న ఇన్ స్పెక్టర్ శ్రీ నివాస్ విఆర్ కు బదిలీ చేస్తూ వరంగల్ ఐజీ నాగిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వారి వారి స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.