ప్రేయర్ కు లేని పంతుళ్ళపై కొరఢా
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)
కరీంనగర్, జూలై 5: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పాఠశాల అది. ప్రేయర్ కు విధిగా హాజరు కావాలనే నిబంధన ఉండగా, కొందరు హాజరు కాలేదు. ఇదే సమయంలో ఆ పాఠశాలను జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకేముంది ప్రేయర్ రాని పంతుళ్ళపై కొరఢా ఝులిపించారు ఆ విద్యాధికారి. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలవరం మొదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ సమీపంలోని దుర్శేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఉదయం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించారు. ప్రేయర్ కు అటెండ్ కాకపోవడం..అనుమతి లేకుండా విధులకు గైర్హాజర్ అయిన ఆరుగురు టీచర్లను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
బోధనేతర సిబ్బంది ఒకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జడ్పీ సీఈఓకు లేఖ రాసిన జిల్లా విద్యాధికారి టీచింగ్ స్టాఫ్ పై కూడా సేమ్ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఒకేసారి ఆరుగురు టీచర్లును సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం..రికార్డు అసిస్టెంట్ పై క్రమశిక్షణ చర్యలకు లెటర్ పెట్టడం…జిల్లాలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది ఒక సంచలనం కాగా, ఉపాధ్యాయులకు ఇదొక హెచ్చరిక అనేే చెప్పవచ్చు.