పాము కాటుకు ఒకరి మృతి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 28: పాము కాటుకు ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి పొలంలో గడ్డి కోస్తుండగా, పాము(రక్త పింజర) కాటు వేసింది. ప్రమాదకరమైన విష సర్పం కాటు వేయడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రి కి తరలిస్తుండగా, అంజయ్య మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి నెల రోజుల క్రితమే స్వగ్రామానికి చేరుకున్న అంజయ్య నెల రోజుల నుండి వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. కాగా, పాము కాటుకు గురైన అంజయ్య ఆ పాము వెంటనే చంపినట్లు తెలిసింది. అంజయ్య మృతితో గ్రామంలో విషాదాన్ని నెలకొంది.