JMS News Today

For Complete News

“సింగ్” బాటలోనే మరికొందరు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 30: మాజీ మేయర్ రవీందర్ సింగ్ బాటలోనే ఆయన మద్దతుదారులు అడుగులేస్తున్నారు. మరికొంత మంది టిఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
జిల్లా మాజీ అధికార ప్రతినిధి, జిల్లా పార్టీ మీడియా సెల్ ఇంచార్జ్ గుంజపడుగు హరిప్రసాద్, నగర ప్రధాన కార్యదర్శులు
దండబోయిన రాము, శ్రీరాముల శ్రీకాంత్, నాయకులు జంపాల నర్సయ్య, శ్రీరాముల రమేష్, శావనపల్లి రాజు, కోత్వల ఆంజనేయులు, శ్రీరాముల శ్రీనివాస్, జనగామ సత్యనారాయణ, గర్శకుర్తి విద్యాసాగర్, చెరుకు రమేష్ తదితరులు రాజీనామా చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్బంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో నాయిబ్రాహ్మణుల అభివృద్ధి శూన్యమని, టిఆర్ఎస్ పార్టీలో నాయి బ్రాహ్మణులకు, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ బలోపేతం కోసం 2009 డిసెంబర్ 23న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, ఆరోజు నుండి ఈరోజు వరకు ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అనేక తెలంగాణ ఉద్యమాల్లో, టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ వస్తే అందరి జీవితాలతోపాటు నాయీ బ్రాహ్మణుల జీవితాలలో కూడా మార్పు వస్తుందని ఆశించి తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా నాయీబ్రహ్మణ జెఏసి ఏర్పాటు చేసి, ఆ వేదిక ద్వారా అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నాయి బ్రాహ్మణులందరిని భాగస్వామ్యం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఉమ్మడి రాష్ట్రంలోనే నాయి బ్రాహ్మణులకు గుర్తింపు ఉందని ఇప్పుడు అనిపిస్తుందని, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ సాధించుకుని దానికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత తెచ్చుకుని దాని ద్వారా నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి బాటలు పడ్డాయన్న ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం కేసిఆర్ ప్రభుత్వం ఆ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ఏడున్నర సంవత్సరాలుగా నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ కు పాలకవర్గాన్ని వేయలేదు సరికదా కనీసం ఫెడరేషన్ కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనేక గ్రామాల్లో నాయి బ్రాహ్మణుల కులవృత్తిని చెట్ల కింద గోడలకు అద్దాలు వేలాడాదీసుకుని నిర్వహించుకునే పరిస్థితి ఎవ్వరికీ రావ్వద్దని, అలాగే వారి దగ్గరకు వచ్చే కస్టమర్లకు కూడా గౌరవంగా ఉండే విధంగా వారికి ఒక లక్ష రూపాయలతో నవీనా క్షౌరశాలలు తీసుకువచ్చి వారి బతుకులు మారుస్తానని ప్రకటించారని, కానీ ఇప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఈ పథకం మంజూరు కాలేదని ఆరోపించారు. అదే కాదని ఇలా అనేక హమీలు హమీలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది మాట అటుంచితే నాయీ బ్రాహ్మణులకు రాజకీయంగా అవకాశాలు లేవని, ఇప్పటివరకు చట్ట సభల్లో నాయీ బ్రహ్మణుల ప్రాతినిధ్యం లేదని తెలిపారు. బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చట్టసభల్లో ఉండాలని, నాయిబ్రాహ్మణుల కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని, ఇప్పటికే ఒక స్థానం రజకులకు ఇచ్చానని, కచ్చితంగా నాయీ బ్రాహ్మణులకు కూడా ఒక స్థానం ఇస్తామని జిహెచ్ఎంసి ఎన్నికల సభ వేదిక నుంచి కేసీఆర్ ప్రకటించారే తప్ప అమలు చేయలేదని అన్నారు. ఇప్పుడు 18 స్థానాలు ఉన్నా కూడా ఒకటి కూడా నాయి బ్రాహ్మణుల కేటాయించకుండా రాష్ట్రంలో ఉన్న నాయీబ్రాహ్మణులను మోసం చేశారని విమర్శించారు. ఇక ఈ రాష్ట్రంలో కేసీఆర్ ద్వారా నాయీ బ్రాహ్మణులకు ఓరిగేది ఏమి లేదని గ్రహించి వారి మాటలు వట్టి నీటి మూటలని తేలడంతో కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి నాయీబ్రాహ్మణులు అందరూ పెద్దఎత్తున మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని, ఇంకా చేస్తారని హరిప్రసాద్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *