తుఫాన్ ఎం చేసిందంటే….
1 min read
Tropical Cyclone Kenneth approaches the coast of Mozambique in this April 25, 2019 handout satellite image. NASA/Handout via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY.
హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం కారణంగా రుతు పవనాల్లో కదలిక లేక నైరుతి రుతు పవనాల రాక రెండు మూడు రోజుల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజా అంచనాల ప్రకారం రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి 21న, తెలంగాణలోకి 22న ప్రవేశిస్తాయని పేర్కొంది. వాయు తీవ్ర తుఫానుగా మారడంతో రుతు పవనాలపై అధిక ప్రభావం పడిందని, అవి కేరళలోకి ప్రవేశించి ఆగిపోవడంతో దేశంలో ఎక్కడా వర్షాలు కురవడం లేదని, వాయు తుఫాను ఆకస్మాతుగా ఏర్పడటం వల్ల రుతుపవనాల ప్రవేశంపై అన్ని సంస్థల అంచనాలు తారుమారయ్యాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై జరుగుతున్న దాడి కారణంగా వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందువల్లే వర్షాభావ పరిస్థితులు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ తెలంగాణ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆలస్యంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5డిగ్రీలకు పైగా ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించారు. కాగా, ఓ వైపు రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరో వైపు భూగర్భ జలాలు పడిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.