మరో చలాన రెడీ….బీకేర్ పుల్
1 min read
కరీంనగర్: ప్రమాదాల నివారణకు కరీంనగర్ పోలీసులు పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. నిన్న హెల్మెట్..నేడు స్పీడ్ గన్… అమలు కు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విధించిన హెల్మెట్ నిబంధనతో సుమారు 90 శాతం మంది వాహనదారులు హెల్మెట్ ను ఉపయోగిస్తున్నారు. తాజాగా వాహనాల వేగం నియంత్రణకు స్పీడ్ గన్ లకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో సీపీ కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రమాదాల నివారణ కు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే స్పీడ్ గన్లను ఏర్పాటు చేస్తున్నామని, మొదట హైవేలపై అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా స్పీడ్ గన్ లపై డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి కె.ఆర్.కె ప్రసాదరావు, ఇన్స్పెక్టర్లు సీతా రెడ్డి, తిరుమల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.