వారు క్షేమంగా ఇంటికీ
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 6: శ్రీనగర్ నుండి వచ్చిన ఎన్ఐటీ విద్యార్థులకు బిజెపి నాయకులు మంగళవారం స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో శ్రీనగర్ లో విద్యాబ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా కరీంనగర్ చేరుకోగా, జిల్లా్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు శాలువ కప్పి సన్మానం చేేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మమ్ములి క్షేమంగా కరీంనగర్ చేర్చిన ఎంపి బండి సంజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, నగర అద్యక్షులు బేతి మహేందర్ రెడ్డి, బిజెవైయం జిల్లా అధ్యక్షులు బోయినిపల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.