కరీంనగర్ ఎసీపీగా “తుల” బాధ్యతల స్వీకరణ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 6: కరీంనగర్ నగర అసిస్టెంట్ పోలీసు కమీషనర్ (ఎసీపీ)గా తుల శ్రీనివాస రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎసీపీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస రావుకు పలువురు నగర పోలీసు అధికారులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎసీపీ శ్రీనివాస రావు సీపీ సత్యనారాయణ తో పాటు అడిషనల్ డిసిపీలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎసీపీ శ్రీనివాస రావు మాట్లడుతూ ఇక్కడ పనిచేసిన అనుభవంతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి పనిచేస్తానని తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.