JMS News Today

For Complete News

రేపటి నుంచే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఫిబ్రవరి 3: కరీంనగర్ నడిబొడ్డున స్వయంభూ శ్రీ వేంకటేశ్వరుడిగా విరాజిల్లుతున్న బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి 13 వరకు ఘనంగా జరగనున్నాయి. ఐదవ పంచమ వార్షిక బ్రహ్మోత్సవమును వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు
శ్రీనివాసచార్యుల పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ చార్యులు, అనువంశిక అర్చకులు చేన్నోజ్వల నాగరాజాచార్యుల నిర్వహణలో ఘనంగా నిర్వహించునున్నారు. దేవాలయాన్ని
సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద దేవతామూర్తుల నమునాలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య 12వ తరం వారసుల రానున్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు భాగస్వాములు కావాలని, విజయవంతం చేయాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *