ఎమ్మెల్యే పీఏ గల్లంతు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, నవంబర్ 3: ఎస్ఆర్ఎస్పీ
కాల్వలో కోరుట్ల ఎమ్మెల్యే పిఏ గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల పట్టణానికి చెందిన టక్కర్ గిరీష్ సింగ్ అనే ప్రభుత్వ ఉద్యోగి లింగంపేట -అంతర్గాం బైపాస్ రోడ్డులోని ఎస్సారెస్పీ కాలువలో గల్లంతయ్యారు. పట్టణానికి చెందిన ముగ్గురు మిత్రులు విజయ్, బాలన్, రామకృష్ణారెడ్డి లతో కలిసి గిరీష్ ఎస్సారెస్పీ కెనాల్ వైపు విందు చేసుకొని తిరిగి వస్తుండగా, సరదాగా ఈత కొట్టేందుకు ఎస్సారెస్పీ కాల్వలో దిగగా, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అతని మిత్రులు రక్షించండి, రక్షించండని కేకలు వేయడం, ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో గిరీష్ నీటి ఉదృతిలో గల్లంతయ్యారు. గిరీష్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగి. గిరిష్ గతంలో ఎలగందుల రమణ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పీఏ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గిరీష్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు పీఏ గా కొనసాగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్వ వద్ద అతని కోసం గాలిస్తున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన గిరీష్ గల్లంతును మిత్ర బృందం జీర్ణించుకోలేక పోతోంది. కేసు దర్యాప్తు లో ఉంది.