అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం….
1 min read
కరీంనగర్: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రతినిత్యం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. బుధవారం కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ వివిధ రకాల నేరాల దర్యాప్తు పకడ్బందీగా కొనసాగించాలన్నారు. 2018 సంవత్సరం వరకు జరిగిన నేరాల దర్యాప్తు ను పూర్తి చేయడంతో పాటు పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. న్యాయస్థానంలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలను కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా సమర్ధవంతమైన సేవలందించిన వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) రవీందర్, కరీంనగర్ టౌన్ ఎసిపీ అశోక్, రూరల్ ఎసిపి ఉషారాణి తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.