గోదావరి ఆత్మ కథ పుస్తకం ఆవిష్కరణ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 11: సినారె అవార్డు గ్రహీత డాక్టర్ దామెర రాములు తెలివాహ పేరిట గోదావరి ఆత్మ కథను రసాత్మకంగా రచించిన కావ్యాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. రెందురోజులపాటు కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాష్ట్ర ఫిజిషియనల్ల సదస్సు సందర్భంగా ఈ కావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ రాములు అన్ని వర్గాల జీవన విధానాన్ని అనుభవపూర్వకంగా నిశితంగా పరిశీలిస్తూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆలోచనలు రచన ద్వారా వివరిస్తూ తన ప్రవృత్తిని కొనసాగించడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసి వారందరిని ఉద్యమ దిశగా పాయనింపజేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. రచయితగా తన ప్రవృత్తిని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. మంత్రితో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అందరు రచయిత డాక్టర్ రాములును అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్,కుమార్, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు తిరుపతిరావు, చంద్రశేఖర్, విజయేందర్ రెడ్డి, పెంటాచారి తదితరులు పాల్గొన్నారు