ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం ఎక్కడికో తెలుసా…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 8 : తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. సచివాలయ కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్లోకి తరలించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తరలింపునకు వీలుగా అధికారులు, సిబ్బంది దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో నూతన సచివాలయ నిర్మాణం, సంబంధిత ప్రణాళికపై చర్చ జరిగింది. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసిన అనంతరం భవనాల పరిస్థితిపై కమిటీ మంత్రివర్గానికి నివేదిక సమర్పించనుంది. మరో వైపు రాష్ట్ర సచివాలయం కూల్చివేతలు చేయరాదని హైకోర్టు ఆదేశించిన సంగతి విధితమే. మొత్తానికి కోర్టు తీర్పు ఎలా ఉండనుందో, ప్రభుత్వ వాదనలు ఏలా ఉండనున్నయో వేచి చూడాల్సిందే మరీ.