JMS News Today

For Complete News

తన్నులు తిన్న లెక్చరర్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 20: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్ తన్నులు తిన్న ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సఫ్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థినితో లెక్చరర్ వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తెలుసుకున్న విద్యార్థులు లెక్చరర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. విద్యార్థుల దెబ్బలకు వెంకటేష్ పారిపోయే ప్రయత్నం చేయగా, మరింత చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *