కరీంనగర్ లో 13 మంది ఎస్ఐల బదిలీ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 17: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో 13మంది సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) లను బదిలీ చేస్తూ సీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అటాచ్ గా పనిచేస్తున్న జె. నరేశ్ కుమార్ అక్కడికే బదిలీ చేశారు. కరీంనగర్ టూ టౌన్ లో అటాచ్ లో ఉన్న ఎల్. వెంకటరమణ అక్కడికే బదిలీ అయ్యారు. ఇల్లంతకుంట నుండి టాస్క్ ఫోర్స్ కు అటాచ్ గా ఉన్న ఎ. నరేశ్ కుమార్ కరీంనగర్ టాస్క్ ఫోర్స్ బదిలీ చేశారు. కరీంనగర్ టూ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న యం.సతీష్ కుమార్ ను ఇల్లంతకుంటకు, జమ్మికుంట లో విధులు నిర్వహిస్తున్న యం.శ్రీనివాస్ ను కేశవపట్నం, సైదాపూర్ నుండి కరీంనగర్ వన్ టౌన్ కు అటాచ్ గా ఉన్న ఎన్. శ్రీధర్ వన్ టౌన్ కు, కేశవపట్నంలో విధులు నిర్వహిస్తున్న టి. సత్యనారాయణ జమ్మికుంట, కరీంనగర్ వన్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న పి. సత్యనారాయణ హుజురాబాద్, సిసిఆర్బి అటాచ్ లో ఉన్న బి పర్శారాములు సిసిఆర్బి, కరీంనగర్ త్రీ టౌన్ లో అటాచ్ లో ఉన్న ఎల్. రాము త్రీ టౌన్ కు, మహిళా పోలీస్ స్టేషన్ కు అటాచ్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్లాగౌడ్ ను టూ టౌన్ కు, సిసిఎస్ నుండి హుజురాబాద్ కు అటాచ్ గా విధులు నిర్వహిస్తున్న బి. చిన్యా నాయక్ హుజురాబాద్ కు, హజురాబాద్ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పి. విజయ్ కుమార్ ను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు బదీలి చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ తమ స్థానాలనుంచి తక్షణం రిలీవ్ అయి కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టాలని సీపీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.