JMS News Today

For Complete News

రాయితీ సిలిండర్ల పట్టివేత….

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

జగిత్యాల, జూలై 4: జగిత్యాల పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలలో గురువారం సివిల్ సప్లై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా రాయితీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని, వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కొనసాగిన ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లను జిల్లా కేంద్రంలోని ఓ ఎల్ పి జి డిష్టిబ్యూటర్ గోదాం కు తరలిచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అధికారుల ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఉంటాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *