JMS News Today

For Complete News

“సుడా” షురూ…ముగిసిన తొలి భేటీ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 20: కరీంనగర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) తొలి సమావేశం శనివారం జరిగింది. సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణ రావు అధ్యక్షతన, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆద్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులు గా, సమావేశం డైరెక్టర్లు గా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు.  మొట్ట మొదటి సుడా సమావేశంలో 5 ఎజెండా అంశాలను ప్రతిపాదిస్తూ..గౌరవ సభ్యుల సమక్షంలో ఎజెండా అంశాల పై ఆమోదం తెలిపారు.  వైస్ చైర్మన్ ( నగరపాలక కమీషనర్) వేణుగోపాల్ రెడ్డి 5 ఎజెండా అంశాలను సబ్యుల ముందు ప్రస్తావించారు. దీంతో ఈ అంశాల పై సమావేశం మూడు గంటలపాటు చర్చించుకున్నారు.1 లక్ష సామర్థ్యం గల మొక్కల నర్సరీ ఏర్పాటు, కరీంనగర్ పట్టణంలో 3 జంక్షన్లను గుర్తించి, సుందరీ కరణ చేయడం, సుడా కార్యాలయం ఏర్పాటు కోసం జెడ్పీ హాల్ ను అద్దెకు తీసుకోవడం, కార్యాలయం ఫర్నిచర్ కొనుగోలు, మరియు అవసరమగు సిబ్బంది నియామకం పై సమావేశంలో చర్చిస్తూ…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల సలహాలు సూచనలు తీసుకున్నారు. అంతే కాకుండా శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థలో టౌన్ ప్లానింగ్ పన్నుల రూపంలో కోటి రూపాయలు నిధులు సమకూరాయని, సమకూరిన నిధులను 72 గ్రామాలు, ఒక నగరపాలక సంస్థ, ఒక మున్సిపల్ పరిదిలో అభివృద్ధి ప్రణాళికల కోసం ఈ సమావేశంలో చర్చించారు. సుడా పరిదిలో వచ్చే ప్రాంతాలను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పరచేందుకు కార్యచరణ చేశారు. ఈ సమావేశంలో చైర్మన్ జి.వి కృష్ణారావు ఎంజెండా అంశాలతో పాటు ఇతర అభివృద్ధి అంశాల పై సభ్యుల అభిప్రాయాలను తెలపాలని కోరారు. దీంతో సబ్యులు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ పై వారి వారి వాదనలను సమావేశంలో వినిపించారు. సమావేశ అనంతరం డైరెక్టర్లు మరియు కార్యనిర్వాహాక సబ్యులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సుడా చైర్మన్ సమక్షంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ పురుషోత్తం, ఏసీపీ వందనం, సుడా సబ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ సుడా నామకరణానికి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపామని, 2017 లో సుడా ఏర్పాటు జరిగిందని అన్నారు. శాసన సభ సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సుడా కాల పరిమితిని పొడగించాలని కోరడంతో సానుకులంగా స్పందించారని తెలిపారు. మొదటి సమావేశం నుండి 3 సంవత్సరాలు సుడా పాలక వర్గం పదవి కాలంలో ఉంటుందని స్పష్టం చేశారు. సుడా విధివిధానాలు, విధులను ఎమ్మెల్యే  కమలాకర్  ఈ సందర్భంగా సభ్యులకు వివరించారు. సుడా సబ్యులు సేవాతత్వంను పెంచుకోవాలని, ప్రజలకు సేవలు అందించడమే సుడా ప్రధాన లక్ష్యం అన్నారు. మున్సిపల్  సిబ్బంది ఖాళీ స్థలాలను గుర్తించి సుడాకు. అప్పగించాలన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయ్యాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో రహాదారుల విస్తరణ అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే విధంగా చూస్కొని పట్టణ అభివృద్దిని మెరుగు పరచాలన్నారు. పట్టణ అధునీకరణ భాద్యత అర్బన్ డెవలప్మెంట్ పై ఉందని సూచించారు. నగరంలో హాస్పిటల్ జంక్షన్, గాంధీ చౌక్ చౌరస్తాలను మొదటగా అధునీకరణ చేయ్యాలన్నారు. వీటికి సంబందించిన ప్రణాళికలు సిద్దం చేసి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంబించాలన్నారు. ప్రజలు కోరుకునే అంశాలను ఎంజెండా అంశాలుగా తీసుకొని మరిన్ని సమావేశాలు నిర్వహించి శాతవాహాన అర్బన్ డెవలప్ మెంట్ ను అభివృద్ది పరుచుకోవాలన్నారు. వచ్చిన కోటి రూపాయల నిధులను వినియోగించి ప్రణాళిక బద్దంగా అభివృద్ది చేయ్యాలని కోరారు. ప్రజలకు నమ్మకం కలిగేలా సుడా విధి విధానాలు ఉండాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.వీ కృష్ణారావు మాట్లాడుతూ సుడా పరిదిలో వచ్చే 72 గ్రామాలను, నగరపాలక సంస్థ 60 డివిజన్లు,  ఒక మున్సిపాలిటీని ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తామన్నారు. సుడా ఏర్పడి సంవత్సర కాలం ముగిసిందని, ఎన్నికల కోడ్ కారణంతో సుడా కార్యచరణ వెనుకబడిందని తెలిపారు. మొదటి సమావేశంతో సుడా కార్యచరణ ప్రారంభమైంది, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని అనుసరించి లక్ష మొక్కల నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు నాటి పెంచడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కల నాటేందుకు చర్యలు తీసుకుంటామని, శాతవాహన పట్టణ అభివృద్ది లో కరీంనగర్ ను సుందరంగా తయారు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *